ఆ మూడు భారీ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా పూజా హేగ్డే పేరే వినిపిస్తోందట‌?

Pooja Hegde's name is also heard as the heroine in those three big films

0
13
Pooja Hegde

టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది పూజా హేగ్డే. ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఇక అక్క‌డ నుంచి ఆమె వెనుదిరిగి చూడ‌లేదు. స్టార్ హీరోలు అంద‌రితో సినిమాలు చేసింది. త‌క్కువు స‌మ‌యంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది ఈ అందాల తార‌.
పూజా ఆచార్య, రాధే శ్యామ్‌, బీస్ట్ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలు.

ఇక త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి అని టాలీవుడ్ టాక్. అంతేకాదు తాజాగా మ‌రో రెండు క్రేజీ ఆఫ‌ర్లు ఈ ముద్దుగుమ్మ ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది అంటున్నారు. హరీష్‌ శంకర్‌, పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పూజాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అల్లుఅర్జున్‌, వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ప‌రిశీలిస్తున్నార‌ట‌. చూడాలి వ‌రుస ఆఫ‌ర్ల‌తో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతోంది ఈ ముద్దుగుమ్మ‌. దీనిపై అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.