కేసిఆర్ బలవంతుడు కాదు, నక్కజిత్తులోడు : రేవంత్ రెడ్డి

0
45

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సిఎం కేసిఆర్ మీద తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దళితులను, గిరిజనులను కేసిఆర్ దారుణంగా మోసం చేశాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి. పార్టీ నేతల మీటింగ్ లో ఆయన మాట్లాడిన మాటలు యదాతదంగా…

ఏడున్నర ఏళ్ళలో కేసీఆర్ చేతిలో దళిత, గిరిజనులు దగా పడ్డారు.

గజ్వెల్ లో జరగబోయే సభ ఆరంభం మాత్రమే..

కేసీఆర్ చట్టాలను అమలు చేసి ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు ఎక్కువ లబ్ది పొందేవారు.

ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎక్కువ దళిత, గిరిజనులు లబ్ధి పొందే వారు.

ఆరోగ్య శ్రీ, ఫీస్ రియంబేర్స్ మెంట్ అమలు చేసి ఉంటే దళిత గిరిజనులకు లబ్ది జరిగేది.

125 వ అంబెడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతా అన్నారు. కానీ ఇంతవరకు పెట్టకపోగా హనుమంతరావు రావు గారు ఏర్పాటు చేస్తామన్న అంబెడ్కర్ విగ్రహాన్ని జైల్లో పెట్టారు.

వి.హెచ్ గారి ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.

గజ్వెల్ సభలో తీర్మానం చేసి విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తాం

కొండపోచమ్మ, మల్లన్న సాగర్ జలాశయాలలో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జల సమాధి అయ్యాయి.

గజ్వెల్ లో సభ ఏర్పాటు చేస్తామని చెప్పినం ఇది కార్యకర్తల పిలుపు. దండోరా మోగిద్దాం దండు కడదాం.. కేసీఆర్ గుండెల్లో దడ పుట్టిద్దం..

ఇందిరా గాంధీ గారిని మెదక్ ఎంపీ గా గెలిపిస్తే దేశంలోనే అధిక పరిశ్రమలు వచ్చాయి.
లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందుకు ఇందిరా గాంధీ గారికి మెదక్ ప్రజల అండగా నిలబడడం వల్లనే అయ్యింది.

గజ్వేల్ సభ ను విజయవంతం చెయ్యాలి. లక్ష మందికి తక్కువ కాకుండా సభ నిర్వహిస్తాం.

గజ్వెల్ చుట్టూ 32 మండలాలూ ఉన్నాయి. మండలానికి 3 వేల మంది రావాలి.

తెలంగాణ లో 34, 707 బూత్ లు ఉన్నాయి. ప్రతి బూత్ నుంచి 9 మంది రావాలి.

కో ఆర్డినెటర్లు ప్రతి బూత్ నుంచి ఒక్క బండి కదిలేలా చర్యలు తీసుకోవాలి.

బూత్ కు 9 మంది వచ్చి కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని జనంలోకి తీస్కెళ్లాలి.

కేసీఆర్ నక్కజితులు ఉంటాయి.. ఆయన మాటలు, మంత్రాలు ఎదుర్కొని పని చేయాలి.

కేసీఆర్ బలవంతుడు కాదు. ఆయన జిత్తులను ఎదుర్కొని అప్రమతంగా ఉండి పని చేయాలి.

ఖర్గే గారు 50 ఏళ్ళు వరుసగా గెలిచారు..అత్యంత అరుదైన రికార్డులు ఆయనకు ఉన్నాయి.

క్రమపద్ధతి క్రమశిక్షణ తో నాయకులు, కార్యకర్తలు పని చేయాలి.

కార్యకర్తలకు ఏ పాస్ లు ఇస్తే వాటిని పాటిస్తూ అక్కడ ఉండి సభలకు హాజరుకావాలి.

అత్యత్యుహం ప్రదర్శిస్తే తర్వాత చర్యలు ఉంటాయి.

సభను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి.

సోనియమ్మ రాజ్యం రావాలంటే గజ్వెల్ కోట ను కొల్లగొట్టాలి.

రాబోయే నాలుగు రోజులు కీలకం అంత కలిసి కొట్లాడి విజయవంతం చేయాలి

20 నెలలు కష్టపడి పని చేసిన వారిని 20 ఏళ్ళు గుండెలో పెట్టుకొని చూసుకుంటాం

ప్రజల కోసం కాంగ్రెస్ అవసరం ఉంది…