ఎందుకమ్మా ఇలా చేశావ్‌..4వ అంతస్తు నుండి బిడ్డను విసిరేసిన తల్లి

0
120

క్షణికావేశంలో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని, పిల్లలను పోషించలేక ఇలాంటి కారణాలతో కన్న  బిడ్డల్ని చంపడానికి వెనకాడడం లేదు. తాజాగా ఓ కసాయి తల్లి కన్నబిడ్డను చంపేసింది. కన్నబిడ్డను నాలుగంతస్థుల భవనంపై నుంచి కింద పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. అనంతరం ఆమె కూడా దూకేందుకు ప్రయత్నిస్తుండగా అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకొని రక్షించారు. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.