బిడ్డకు తల్లి పాలు చాలడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

0
42

కన్న బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం. తల్లిపాలు ఎంత ఎక్కువ పట్టిస్తే శిశువు అంత ధృడంగా తయారవుతారు. అయితే కొంతమంది తల్లులు అవగాహన లేకపోవడంతో తమ వద్ద పాలు ఉన్న కూడా డబ్బా పాలకు అలవాటుపడుతుంటారు. మరికొందరు పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ చిట్కాల ద్వారా పాలను పెంచుకోవచ్చు.

తరచూ పాలివ్వాలి:

బిడ్డకు తరచూ పాలిస్తూ ఉండాలి. కేవలం ఏదో ఒక వైపే కాకుండా పాలిచ్చేందుకు రెండు రొమ్ములను ఉపయోగించాలి. పిల్లలు ఎక్కువ సేపు రొమ్ము పాలు తాగేలా చూసుకోవాలి…ఇది వ్యాయమంగానూ ఉపయోగపడుతుంది. దీని ద్వారా పాల ఉత్పత్తి శక్తి పెరుగుతుంది.

నీరు ఎక్కువుగా తీసుకోవాలి:

ఎక్కువుగా నీరు తాగడం, హైడ్రేట్ డ్ గా ఉండటం ద్వారా తల్లి రొమ్ములో పాలు ఉత్పత్తి అవుతాయి. తల్లి పాలలో అధికమొత్తంలో నీరు ఉంటుంది. అందుచేత నీరు ఎక్కువుగా తీసుకుంటే పుష్కలంగా రొమ్ములో పాలుంటాయి. తల్లులు కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవడంతో పాటు పండ్లరసాలు, హెర్బల్ టీలు, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువుగా తాగుతూ ఉండాలి.

ఆకుపచ్చ కూరగాయలు తినండి:

తల్లుల రొమ్ములకు పాలను అందించే గొప్ప వనరులు ఆకుపచ్చని కూరగాయలు. పాలకూర, మునగకాయలు, బచ్చలికూర వంటివాటికి పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలున్నాయి. పచ్చి కూరగాయలే కాకుండా.. క్యారెట్, దుంపలను సలాడ్ గా తింటే ఇవి కూడా తల్లి పాలను పెంచేందుకు ఉపయోగపడతాయి.