ప్రియుడితో భార్య అక్రమ సంబంధం..ఆమె భర్త ఏం చేశాడంటే?

0
123

రోజురోజుకు అక్రమ సంబంధాల వల్ల హత్యలు పెరుగుతున్నాయి. దీనితో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. విడిపోయిన తన భార్యను ప్రేమించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసాడో వ్యక్తి.

వివరాల్లోకి వెళితే..కిరణ్ భార్యతో దినేష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వీరిద్దరి మధ్య వ్యవహారం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. తన ప్రియుడైన దినేష్ తో..అతని భార్య కలిసి ఉంటోంది. అయితే తన ఇంటికి రావాలని భర్త ఆమెను పలుమార్లు అభ్యర్థించిన అప్పటికీ ఆమె నిరాకరించింది.

దీంతో చేసేది ఏమీ లేక శుక్రవారం రాత్రి దినేష్ ఇంటికి వెళ్లి.. వారిద్దరిని హత్య చేశాడు కిరణ్. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.