ఈమె భార్య కాదు – ఏకంగా అఫైర్ కోసం భర్తని ఏం చేసిందంటే ?

0
129

ఈ రోజుల్లో కొందరు భార్యలు భర్తల అడ్డు తొలగించుకునేందుకు అనేక స్కెచ్ లు వేస్తున్నారు. ఇక ప్రియుడితో అక్రమ సంబంధాలు ఉంటే ఆ వ్యక్తులతో కలిసి భర్తలని అంతం చేస్తున్నారు.

ముంబైలోని తన  భర్త రయీస్  కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది భార్య. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అయితే అన్నీ కోణాల్లో విచారణ చేస్తే ఆమె ఫోన్ కాల్స్ ఛాటింగ్, భర్త ఫోన్ కాల్ ఛాటింగ్ చూశారు. ఇందులో ఓ యువకుడితో ఆమె అఫైర్ పెట్టుకుందని తేలింది, ఆమెని పిలిచి మరోసారి ప్రశ్నించారు, ఆమె ఏం తెలియనట్టు చెప్పింది, అయితే ఆమె కుమార్తె మాత్రం ఆ యువకుడు మా అమ్మ కలిసి.మా నాన్నని ఇంట్లో చంపారు అని చెప్పింది.

దీంతో పోలీసులకు సీన్ అర్దం అయింది.లేడీ కానిస్టేబుళ్లతో ఆమె నుంచి నిజాలు రాబట్టారు, తమ అఫైర్ కి భర్త అడ్డు వస్తున్నాడు అని అతన్ని చంపాలి అని ప్లాన్ చేశాం…భోజనంలో నిద్రమాత్రల పొడి వేశాము, నిద్రలో జారుకున్న భర్తని ఆమె ప్రియుడు సాయంతో చంపేసింది…బెడ్రూంలోనే గొయ్యి తీసి శవాన్ని పూడ్చిపెట్టేశారు.