మనం ఎన్నో రకాల చేపలు చూస్తాం. కొన్ని చేపలు ముట్టుకుంటే కూడా ప్రమాదకరం. కొన్నింటిని అసలు టచ్ చేయలేం, తినలేము కూడా. ఇందులో కొన్ని విషంతో కూడినవి కూడా ఉంటాయి. అయితే ఇవి 99 శాతం నీటిలోనే ఉంటాయి. మిగిలిన ఒక శాతం ఏమిటి అని మీకు డౌట్ వచ్చిందా, కొన్ని చేపలు భూమిపై ఉంటాయి. అలాగే కొన్ని కొండలు, గుట్టలు కూడా ఎక్కుతూ ఉంటాయి.
మీరు హవాయి దీవుల్లోని కనిపించే ఓప్ చేప గురించి తెలుసుకోవాలి. ఈ చేప జలపాతాలలోని రాళ్లపై పాకుతూ సుమారు 300 మీటర్ల వరకు వెళుతుంది. అంటే నీటిలో గుట్టలపై పర్వాతాలు ఇలా ఎక్కడైనా ఇది ప్రయాణిస్తుంది. సాధారణంగా చేపలు నీటిలో నుంచి బయటకు వస్తే ఎక్కువ సేపు ఉండవు చనిపోతాయి. కానీ ఇది మాత్రం ఎంత సేపు అయినా ఉంటుంది.
ఈ చేపలకు నోరు, ఉదరం కింద ఉండే రెక్కల భాగాల సహాయంతో జలపాతాలలోని రాళ్లపై పాకుతూ ఉంటాయి. ఇక ఊసరవెల్లిలా ఇది కూడా రంగులు మార్చుకోగలదు. ఇవి గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇవి అడుగు పొడుగు పెరుగుతాయి. ఇక ఇవి చాలా రేర్ ప్రపంచంలో మొత్తం 1500 కూడా ఉండవు అంటున్నారు నిపుణులు.