ఏపీలో దారుణం..కత్తులు, రాడ్లతో దాడి చేసి యువకుడుని దారుణ హత్య

0
133

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాల్లో దారుణ హత్య చోటుచేసుకుంది. రెబాక సాయి తేజ అనే 25 ఏళ్ళ యువకుడిని కొందరు గుర్తుతెలియనివ్యక్తులు దారుణంగా హత్య చేసి ఘటన స్థలం పరారయినా సంఘటన మర్రిపాలెం రైల్వే క్వాటర్స్‌లో జరిగింది. కత్తులు, రాడ్లతో దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.

దాంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా యువకులు మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసినట్టు ప్రాధమికంగా నిర్దారించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి..నిందితుల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.