వడ్ల కుప్పను ఢీకొన్న బైక్..యువకుడు మృతి

Young man killed after bike collides with bush

0
77

రోడ్డుపై పోసిన వడ్ల కుప్పకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..మిరుదొడ్డి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) అదివారం రాత్రి బైక్‌పై తన బంధువు దానయ్యతో కలిసి ఎనగుర్తి వైపు వెళ్తున్నాడు. భూంపల్లి గ్రామ సమీపంలో రహదారిపై నల్లని పాలీథీన్‌ కవర్‌ కప్పి ధాన్యం కుప్ప ఉండడంతో చీకటిలో కనిపించక ఢీకొంది. ప్రభు బైక్‌పై నుంచి రహదారిపై ఎగిరిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. దానయ్యకు గాయాలయ్యాయి. ప్రభుకు భార్య రాధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ మధ్య రోడ్లపై వడ్ల కుప్పల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. ప్రధాన రోడ్లపై వడ్ల కుప్పలు పోస్తే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.