బయట ఆరేసిన మహిళ లోదుస్తులు చోరీ చేసిన యువకుడు- చివరకు భయంతో ఏం చేశాడంటే

భోపాల్ లో దారుణం జరిగింది

0
131

భోపాల్ లో దారుణం జరిగింది. రవి అతని భార్య స్దానికంగా గాంధీనగర్ లో ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో రవి భార్య లోదుస్తులు ఉతికి ఆరేసింది. ఇక రాత్రి సమయంలో బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. అక్కడ ఓ కుర్రాడు ఆమె లో దుస్తులు తీసుకున్నాడు. ఆ టీనేజర్ ని ఆ జంట చూసింది. వెంటనే రవి అతన్ని పట్టుకున్నాడు. స్దానికుల సాయంతో అతన్ని ఓ రూమ్ లో బంధించారు.

అతను ఇలా దొంగతనం చేస్తుండగా పట్టుకున్నాము అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో పోలీసులు అక్కడకు వచ్చారు. అయితే ఆ టీనేజర్ రూమ్ లో ఏకంగా ఉరి వేసుకుని చనిపోయాడు. దీంతో అక్కడ అందరూ షాక్ అయ్యారు. ఇక్కడ రవి, అతని భార్యది ఎలాంటి తప్పు లేదని, అతన్ని ఏమీ అనకుండా వెంటనే రూమ్ లో ఉంచి పోలీసులకి సమాచారం ఇచ్చారని స్ధానికులు చెప్పారు.

మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే అతను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తా? కాదా అనేది తెలియాల్సి ఉంది.