యువతి డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు..ఆ తర్వాత..

Young men videotaped a young woman changing her dress in Hyderabad

0
81

హైదరాబాద్‌ నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరిపోతున్నాయి. పోకిరీల చేష్టలతో యువతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హెచ్‌ అండ్‌ ఎం షాపింగ్‌ మాల్‌లో దుస్తులు తీసుకుందామని ఓ యువతి వచ్చింది. దుస్తులు నచ్చడంతో వాటిని ట్రయల్‌ రూంకి తీసుకెళ్లింది. ట్రయల్‌ రూమ్‌లో యువతి డ్రెస్‌ మార్చుకుంటుండగా..ఇద్దరు యువకులు వీడియో తీశారు.

ఇది గమనించిన యువతి వెంటనే కేకలు వేసింది. అక్కడున్న వారు వెంటనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వెంటనే షాపింగ్‌ మాల్‌కి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను, స్టోర్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతి డ్రెస్‌ మార్చుకుంటుండగా తీసిన వీడియోను డిలీట్‌ చేయించి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.