ముఖ్యమంత్రికి కొరడా దెబ్బలు..ఎందుకో తెలుసా?

Chief Minister whipped..shock if you know the reason!

0
36

అతనొక ముఖ్యమంత్రి, నిత్యం పది మంది సెక్యూరిటీ గార్డ్‌లు వెంట ఉంటారు. ఈగ వాలాలన్నా వారి పర్మిషన్‌ ఉండాల్సిందే. అలాంటి ముఖ్యమంత్రిని ఓ వ్యక్తి కొరడాతో కొట్టాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు చూస్తూ వీడియోలు తీశారు కానీ అడ్డుకోలేదు.

ముఖ్యమంత్రిని కొరడాతో కొట్టడం, దానిని వీడియో తీయడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ. అయితే ఇదంతా ఓ ఆచారంలో భాగమేలేండి. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని ఒక గ్రామంలో గోవర్ధన్ పూజ పండుగ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్బంగానే ఆచారంలో భాగంగా ఆయన కొరడాతో కొట్టించుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రతి ఏటా ఛత్తీస్‌గఢ్‌లో గోవర్ధన్‌ పూజను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా గోవుకు పూజలు చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగానే కొందరు కొరడా దెబ్బలు తిని, తమ కోరికలు నెరవేరాలను కోరుకుంటారు. సీఎం లాంటి వ్యక్తి కూడా సంప్రదాయానికి పెద్ద పీట వేయడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/bhupeshbaghel