జుట్టు రాలుతుందని యువతి దారుణ నిర్ణయం..ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

0
92

నేటి కాలంలో యువతీ, యువకులు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాలపడుతున్నారు. అందంగా లేనని, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఇలాంటి కారణాలకే తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని మైసూర్​లో ఘోరం జరిగింది. జుట్టు రాలిపోతుందని మనస్తాపంతో ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.