ప్రయాణికులకు అలెర్ట్..నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

0
40

హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్. భాజపా విజయ సంకల్ప సభ సందర్భంగా నగరంలో పలు చోట్ల  ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజభవన్‌, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్‌ గౌడ్స్‌ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం మానుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 040-27852482 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

 ఎంజీరోడ్, ఆర్‌పీరోడ్, ఎస్‌డీరోడ్‌తో పాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హెచ్‌ఐసీసీ మాదాపూర్‌- జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-రాజ్‌భవన్‌-పంజాగుట్ట-బేగంపేట విమానాశ్రయం- పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాల్లోనూ ఆంక్షలుంటాయి.

టివోలీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ప్లాజా రోడ్‌ మధ్య రహదారి మూసివేస్తారు. సికింద్రాబాద్‌ పరిధిలో పలు జంక్షన్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.

ట్రాఫిక్‌ మళ్లింపులు..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు.

పంజాగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా చిలకలగూడ ప్లాట్‌ఫాం 10 ద్వారా వెళ్లాలి.

ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే వారు నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిలకలగూడ నుంచి రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం10 ద్వారా వెళ్లాలి.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు చేరుకునే వారు ప్యారడైజ్, బేగంపేట రహదారులపై ప్రయాణించకండి.

కరీంనగర్, నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులు బాహ్యవలయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించాలి.

ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా పంజాగుట్ట/అమీర్‌పేట వైపు వెళ్లే ప్రయాణికులు తార్నాక, రైల్‌ నిలయం కాకుండా ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్‌ లక్డీకాపూల్‌ మీదుగా వెళ్లాలి.

మేడ్చల్, బాలానగర్, కార్ఖానా, తిరుమలగిరి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే ప్రయాణికులు నేరెడ్‌మెట్, మల్కాజిగిరి నుంచి వెళ్లాలి.

బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటలకు మొదలై.. రాత్రి 10 గంటలకు పూర్తవుతాయి.