Puja |పెళ్ళైన ఆడవాళ్లు దీపారాధన చేయాలంటే రోజూ తల స్నానం చేయాలా..? అనే అనుమానం సహజంగా చాలామందికి ఉంటుంది. ఈ అనుమానంతో రోజూ దీపారాధన చేయడం మానేస్తున్నారు. లేదంటే ప్రతిరోజూ తలస్నానం చేసి దీపారాధన చేస్తుంటారు. పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకుండా దీపారాధన చేయొచ్చా? లేదా? అనే ప్రశ్నకు పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు. మాములుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్య దీపారాధన, రోజూ చేసుకునే పూజ చేయవచ్చు. ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని పాపిట్లో నిలుపుకొని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నాన అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే తల స్నానం చేసినట్టు. అయితే ఏదైనా వ్రతం, పూజ(Puja), ముడుపు, దీక్ష లాంటివి ఉన్నపుడు తప్పక తలస్నానం చేయాలి. ఆడవాళ్ళు బుధ, శనివారం తలస్నానం చేయడం మంచిది. శుక్రవారం వ్రతాలు ఉన్నపుడు శుక్రవారం చేయవచ్చు. బహిష్టు ఉన్నపుడు కచ్చితంగా 1, 3, 4, 5 రోజుల్లో తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.