టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్రిటీష్ టెలివిజన్ షోలో కనిపించబోతున్నాడు. ప్రముఖ సాహసికుడు బేర్ గ్రీల్స్‌తో కలిసి అడ్వెంచర్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. డిస్కవరీ ఛానెల్‌లో ప్రముఖ జంగిల్ సర్వైవల్ ప్రోగ్రామ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కోసం అనేక సహాసాలు చేసే బేర్ గ్రిల్స్ తర్వలో విరాట్ కోహ్లీతో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బేర్ గ్రిల్స్ తన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం విరాట్ కోహ్లీని సంప్రదించాడంటూ సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ వంటి వారితో అడ్వెంచర్స్ ప్రోగ్రామ్ చేసిన బేర్ గ్రిల్స్.. తనకు విరాట్ కోహ్లీ(Virat Kohli), ప్రియాంక చోప్రా(Priyanka Chopra)తో ఓ ఎపిసోడ్ తీయాలనే ఆలోచనతో ఉన్నట్లు గతంలో చెప్పాడు. ఈ మేరకు తాజాగా ఆయన టీమ్ విరాట్‌ను సంప్రదించారనే ప్రచారంతో విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గ్రౌండ్‌లో తన బ్యాట్‌తో అభిమానులను ఉర్రూతలూగించే విరాట్ బేర్ గ్రిల్ షోకు వెళ్తే ఎలాంటి అడ్వెంచర్స్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది. కాగా, ఈ ప్రోగ్రామ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రపంచ సాహసికుడితో కింగ్ కోహ్లీ అడ్వెంచర్?
-