Lakshmi Kataksham: భక్తిశ్రద్ధలతో నమస్కారం పెట్టినా లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనపై ఉంటుంది. కానీ అమ్మవారిని వెంటనే ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పూజలు చేయాల్సిందే. మరి అమ్మవారిని ఎలా పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి బాగా అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తే మంచిది. అలాగే గులాబీ, తామర పువ్వు, మల్లెలు, సన్నజాజులతో పూజ చేసినా మంచిదే.
అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం (Lakshmi Kataksham)తో సంపదలు చేకూరుతాయి.