వైశాఖ శుద్ధ తదియను “అక్షయ” తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు. అయితే అంతా శుభప్రదంగా భావించే ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.
- పరశురాముని జన్మదినం ఈరోజే.
- పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు ఇది.
- శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.
- వ్యాస మహర్షి మహా భారతంను వినాయకుని సహాయముతో రాయడం మొదలుపెట్టిన రోజు.
- సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.
- శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.
- ఆదిశంకరులు “కనకధారాస్తవం”ను చెప్పిన రోజు(Akshaya Tritiya).
- అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.
- ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు.