శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. ఉద్యోగంలో పై అధికారుల మన్ననలు పొందాలన్నా, పెళ్లి సంబంధం త్వరగా కుదరాలన్నా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా ఈ ప్రసాదాలు పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
కొబ్బరిముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి.
ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు నవమి రోజు రామయ్యకు సపోటా పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలి.
కమలాపండు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.
జామ పండును నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, సఖ్యత పెరుగుతుంది.
పెద్దపెద్ద కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటే పనస పండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలి. Sri Rama Navami