special puja at Srikalahasti:శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహనం నేపథ్యంలో అన్ని ఆలయాలు మూత పడ్డాయి. గ్రహణ ప్రభావం శ్రీకాళహస్తీశ్వర ఆలయంపై ఉండకపోవటంతో.. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. గ్రహణ సమయంలో రాహు, కేతు ప్రభావంతో దైవ శక్తి క్షీణిస్తుందని పండితులు, పురోహితులు నమ్ముతారు. కానీ శ్రీకాళహస్తిలో నవగ్రహ కవచం ఉండటంతో, ఇక్కడ ఆలయంలో దైవశక్తి క్షీణించదని పండితులు వెల్లడించారు. గ్రహణ సమయంలో రాహు, కేతువులకు ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహిస్తే.. గ్రహణ ప్రభావం ఉండదనీ.. సకల సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే చంద్రగ్రహణం కారణంగా, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. దీంతో అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
-