కార్తీకమాసం సందర్భంగా శ్రీకాళహస్తి దర్శనవేళల్లో మార్పు

-

Srikalahasti |రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నెల రోజుల పాటు కోటి కుంకుమ బిల్వార్చన, తదితర పూజలు చేయనున్నారు. దీంతో ఉదయం 4గంటలకే ఆలయం తెరవనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ఈవో వెల్లడించారు.

- Advertisement -

Srikalahasti | శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి పండుగ మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం(Karthika Masam) ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

Read Also: అష్టోత్తరం తో శివపూజ చేసే టైం లేదా? ఈ 8 నామాలతో పూజ పరిపూర్ణం!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...