ఈ వినాయకుడికి నిమజ్జనం చేయరు.. ఎక్కడో తెలుసా?

-

విఘ్నాలకు అధిపతిగా పూజలందుకుంటున్న వినాయకుడికి యేటా నవరాత్రులు నిర్వహించి నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఈ వినాయకుడికి మాత్రం నిమజనం అనేదే లేదు. ఈ వినాయకుడిని మొక్కుకుంటే అది తప్పనిసరిగా జరిగి తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిర్మల్ జిల్లా కుబీరు మండలం నిగ్వా గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నాందేడ్ జిల్లా పాలజ్ గ్రామంలో ఈ కర్ర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ ఈ వినాయకుడి ప్రతిష్టాపన వెనుక ఒక ఘటన ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ ప్రాంతంలో కలరా, ప్లేగు వంటి మహమ్మారులు ప్రబలి ప్రజలు మరణించేవారు. ఒకే యేడాది ఇలా దాదాపు 30 మంది మరణించారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గ్రామస్తులు కొందరు వినాయకుని విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయించారు.

- Advertisement -

1948 లో నిర్మల్ కు చెందిన నకాషి విగ్రహ రూపకర్త పోలకొండ గుండాజీ వర్మను పిలిపించి కర్ర వినాయకుడిని తయారు చేయించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అంతకు ముందున్న కలరా, ప్లేగు వ్యాధులు పూర్తిగా నయం కావటంతో స్వామిపై విశ్వాసం పెరిగింది. దీంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఏటా వినాయక నవరాత్రులలో తప్ప మిగిలిన రోజులలో స్వామివారి దర్శనం ఉండదు. వినాయక చవితి రోజు ప్రతిష్టాపన జరుగుతుంది. పదకొండు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం రోజున నదీ జలాలు తెచ్చి స్వామివారిపై చల్లుతారు. దీంతో నిమజ్జనం పూర్తయినట్లు భావిస్తారు. మరుసటి ఏడాది వరకు విగ్రహాన్ని ఒక గదిలో భద్రపరుస్తారు. అప్పటి నుంచి ఏడాది వరకు స్వామివారి దర్శనం ఉండదన్న ఉద్దేశ్యంతో ఈ పదకొండు రోజుల పాటు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వినాయక చవితి ఉత్సవాలను గ్రామస్తులే సమిష్టిగా నిర్వహిస్తారు. వచ్చిన ఆదాయంతో భక్తులకు వసతులు కల్పిస్తారు. సత్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన నీటి సౌకర్యం కల్పిస్తున్నారు

ఎలా వెళ్లాలంటే…

భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రైవేట్ వాహనాలు, బస్సు సౌకర్యం ఉంది. భైంసా వరకు ప్రభుత్వ రవాణా సౌకర్యాలు వినియోగించుకుని రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...