శ్రీవారికి బంగారు కంఠా భరణం కానుకగా సమర్పించిన TTD చైర్మన్ దంపతులు

-

TTD chairman donates necklace to Tirumala Srivaru temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం 2కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ కు చైర్మన్ దంపతులు ఈ ఆభరణం అందించారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనే స్వామివారికి కానుకను సమర్పించినట్లు టీటీడీ చైర్మన్ దంపతులు తెలిపారు.

- Advertisement -

ఈ నెల 12నుండి 18వ తేదీ వరకు విశ్వ శాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠం లో నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసిందని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) – స్వర లత దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యాంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Srivaru) వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామి వారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని వారు చెప్పారు. శ్రీ శ్రీనివాస మహా విశ్వ శాంతి యాగం విజయవంతంగా ముగిసినందువల్ల స్వామి వారికి కానుక సమర్పించామని చెప్పారు.

Read Also: DIG ని కలిసి ఆ విషయం చెప్పామంటోన్న TDP నేతలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...