Zodiac signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పుడూ ఒకే రాశిలో స్థిరంగా ఉండవు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కాలగమనం ప్రకారం గ్రహ సంచారం మారుతూ ఉంటుంది. దీంతో కొన్ని జాతకాలపై వీటి ప్రభావం పడుతుంది.
నేడు శని దేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శని దేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి జాతకం మారనుంది. ధనవంతులయ్యే యోగం, చేసే పనుల్లో పురోగతి కనిపించనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో వారికి ఎలాంటి లాభాలు చేకూరాలని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారికి శని దేవుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. శనిగ్రహం మీ జాతకంలోని మూడో ఇంట్లో సంచరిస్తాడు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కళా రంగంతో సంబంధం ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహాసాలు పెరుగుతాయి.
మకర రాశి (Capricorn): శని దేవుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి శని సంచారం లాభదాయకం గాఉంటుంది. ఎందుకంటే ఈ రాశి శని దేవుడికి ఇష్టమైన రాశి. మరోవైపు జనవరి 17న శనిదేవుడు మొదటి దశ సాడే సతిని పూర్తి చేసి రెండో దశ ప్రారంభం కానుంది. ఈ రెండో దశలో శష్ అనే రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవిని పొందే అవకాశం ఉంది.
మిథునం రాశి (Gemini): శని రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని సంక్రమించిన వెంటనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మతపరమైన పనుల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీతో బంధాలు గట్టిగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి.