వేసవిలో ఈ ఫుడ్స్ రోజువారీ డైట్ లో చేరిస్తే మంచి బెనిఫిట్స్

-

Summer Diet |వేసవి ఎండ తీవ్రత బాగా పెరిగింది. భానుడు భగభగ మండుతున్నాడు. ఇంటి నుండి బయటకు కాలు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు జనం. మండే వేసవిలో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లే వారైనా, ఇంట్లో ఉండే వారైనా సరే తప్పనిసరిగా తమ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రతిరోజు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఏదో ఒకటి కడుపులో పడ్డాకే కాలు బయట పెట్టాలి. లేదంటే నీరసించిపోతాం. ఎండకు ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం, పండ్లూ కూరగాయల ముక్కలూ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

మద్యం, కాఫీ, టీ, ధూమపానం… ఒంట్లోని నీటి నిల్వల్ని అడుగంటేలా చేస్తాయి. ఎండాకాలంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలూ సమోసాలూ మిర్చీబజ్జీలను ఆమడ దూరంలో ఉంచాలి. అవేకాదు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఏ పదార్థమైనా దూరం పెట్టాలి. ఎందుకంటే, ఎండవేడిమి కొవ్వుపై చెడు ప్రభావం చూపుతుంది.

పాలకూర, కీరా, అల్లం, వెల్లుల్లి, బీట్రూట్ వంటివి వేసవి దెబ్బను తట్టుకునే శక్తినిస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటా, దోసకాయ, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి.

Summer Diet |సొరకాయ అరికాళ్లకు రుద్దుకుంటే వేడితగిపోతుందనీ, మొహం మీద కీర దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చలువనిస్తుందనీ, నుదుటి మీద మంచిగంధం రాసుకుంటే హాయిహాయిగా ఉంటుందనీ, రోజ్ వాటర్ ని రిఫ్రిజిరేటర్ ఐస్ ట్రే లో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్లంతా రుద్దుకుంటే |ఆనందమే ఆనందమనీ… చాలా చిట్కాలే ప్రచారంలో ఉన్నాయి. వీటి వల్ల వేసవి సమస్యకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేం కాని, ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది.

Read Also: పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AAP | ఢిల్లీ ఎలెక్షన్స్… ఆప్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార...

MLC Kavitha | ‘అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా’.. మళ్ళీ యాక్టివ్ అయిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాదాపు 85 రోజుల తర్వాత ఎక్స్(ట్విట్టర్)...