Best remedies to reduce belly fat: అధిక పొట్ట తగ్గించే అద్భుత చిట్కాలు

-

Best remedies to reduce belly fat: నేడు ఎక్కువమంది బాధపడుతున్న సమస్య అధిక పొట్ట. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. ఇందుకోసం రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆహారంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు.

- Advertisement -

కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, అనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్టు తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం. పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.

ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకోవడం రకరకాల పిండి పదార్ధాలతో బయట చేసే పిండి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం తినాలి.

రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి.

రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిల్ పండో తినండి. పగటి నిద్రకు దూరంగా ఉండాలి.

భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా తాగాలి. దీంతో ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం 30 నిమిషాలకు ఒక్కసారి నీళ్ళు త్రాగండి.

కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.

సహజంగా లభించే గ్రీన్ టీని ఉదయం పూట సేవించాలి.

దానిమ్మ జ్యూస్ తప్ప మిగితా అన్ని రకాల జ్యూసులను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.

అధిక బరువును అరికట్టే ఆహార పదార్ధం బార్లీ, ఈ బార్లీ గింజలను గంజి చేసుకొని తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.

Read Also: సన్నబడాలనుకుంటున్నారా?.. అయితే ఇది చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...