Sunday Holiday: ఆదివారం సెలవు చాలా బాగుటుంది. కానీ ఆదివారంను సెలవుగా ప్రకటించటం కోసం ఎనిమిదేళ్లు సుధీర్ఘంగా మహా ఉద్యమమే జరిగింది తెలుసా? బ్రిటీషర్లు మన దేశాన్ని పాలించేటప్పుడు భారతీయులను కూలీలుగా మార్చి.. ఎన్నో పనులు చేయించుకునేవారు. కానీ సెలవు మాత్రం ఇచ్చేవారు కాదు. దీంతో వారంలో కనీసం ఒక్కరోజైనా సెలవు ఉండాలంటూ.. మేఘాజీ లోఖండే ఆదివారం సెలవు కావాలంటూ బ్రిటీషర్లపై పోరాటానికి దిగారు. కానీ తెల్లదొరలు సెలవు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఆదివరాన్ని సెలవుగా ప్రకటించాలంటూ సుమారు ఎనిమిదేళ్లు సుధీర్ఘ ఉద్యమం చేశారు భారతీయులు. మేఘాజీ లోఖండే ఉద్యమానికి తలవంచిన బ్రిటీష్ ప్రభుత్వం ఆదివారాన్ని సెలవుగా 1889లో ప్రకటించారు. అప్పటి నుంచి ఆదివారం అందరికీ సెలవుగా పరిగణలోకి వచ్చింది. ఆదివారాన్ని సెలవు(Sunday Holiday)గా ఇవ్వటానికి మతపరమైన కారణాలు కూడా ఉన్నాయని అంటారు. క్రైస్తువులు ఆదివారాన్ని దేవుని వారంగా భావిస్తారు. పైగా బైబిల్‌లో కూడా ఆదివారానికి ప్రత్యేక స్థానం ఉంది. క్రీస్తు తిరిగి ఆదివారమే బతికాడనీ.. గుడ్ ఫ్రైడ్ అనంతరం వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ సండేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం భారత ప్రభుత్వం వారాంతపు సెలవుగా పరిగణించలేదు కానీ.. బ్రిటీషర్ల కాలం నుంచి కొనసాగుతోంది.