Sleep :నిద్ర రావటం లేదా.. అయితే ఆహారం మార్చండి!

-

Sleep :అబ్బా మీరు ఎంత అదృష్టవంతులండి ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది.. నాకు అలా కాదండి బాబు బలవంతాన కళ్లు మూసుకున్నా.. రాత్రి ఏ మూడు గంటలకో కలత నిద్ర పడుతుంది అని వాపోతున్నారా? అయితే మీరు తినే ఆహారాన్ని మార్చితే.. మీరు కూడా హాయిగా మంచం మీద వాలగానే నిద్ర పట్టేస్తుంది. నిద్రకు, తినే తిండికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా.. అయితే ఈ ఆర్టికల్‌ చదివేయండి.. పాటించండి.. మంచిగా నిద్రపట్టకపోతే.. అప్పుడు చెప్పండి.

- Advertisement -

కొందరు రాత్రుళ్లు స్పైసీ ఫుడ్‌, బయట ఫుడ్‌లు తినటానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ అతి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కారంగా ఉండే ఫుడ్స్‌ ఆహారంగా తీసుకోవటం వలన కడుపులో యాసిడ్‌ మోతాదు ఎక్కువుతుంది. వీటి వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ సమస్యలన్నీ నిద్రని (Sleep) దూరం చేస్తాయి. మరొకటి ఏమిటంటే, అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలను రాత్రుళ్లు తినటం కూడా నిద్రలేమి సమస్యకు ఓ కారణం. ఈ కొవ్వు పదార్థాలు పగటి పూట తిన్నా సరే, రాత్రుళ్లు నిద్ర నాణ్యత తగ్గుతుంది. అంటే, కళ్లు మూసుకున్నా.. మెలుకువుగా ఉన్నట్లే ఉండే అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాఫీ, టీలు పనివేళల్లో పగటి వేళ తాగుతుంటే.. వాటిని తాగటం తగ్గించటం ఉత్తమం. ఎందుకంటే, వీటిల్లో కెఫీన్‌ ఎక్కువ ఉండటం వలన మెదడులోని అడెనోసిన్‌ గ్రాహకాలను నిరోధించవచ్చు.

అడెనోసిన్‌ అనేది మన మెదడులో ఉండే రసాయనం, ఇది నిద్రను ప్రోత్సహించే రసాయనం. కెఫీన్‌ చురుకుదనాన్ని పెంచుతుంది. దీని వల్ల నిద్రలేమి సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి పడుకునే ముందు కాఫీ తాగడం మానేస్తే.. మంచి నిద్ర (Sleep) మీ సొంతం అవుతుంది. కూల్‌ డ్రింక్స్‌లలో కూడా కెఫిన్‌ ఉంటుంది. వాటిని కూడా రాత్రుళ్లు దూరం పెడితే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇవేగాకుండా పడుకునే ముందు సెల్‌ఫోన్స్‌, గ్యాడ్జెట్స్‌ను గంట ముందు నుంచే దూరంగా పెట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వచ్చే బ్లూ లైట్‌ వల కళ్లు మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రపోయే ముందు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడిని నుంచి రిలీఫ్‌ వచ్చి.. త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంది. సరైన నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని గుర్తు పెట్టుకోండి. కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...