ఎవరైనా ఉద్యోగి ఆఫీసుకు వచ్చి కాసేపు పని చేయకపోతేనే యాజమాన్యం సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు కూడ పద్ధతి మార్చుకోకపోతే వేటు వేస్తుంది. కానీ చైనాలో ఓ ఉద్యోగి మాత్రం తనను ఉద్యోగం నుంచి తొలగించారంటూ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. అయితే అతడిని ఎందుకు తొలగించారో కారణం చెప్పడంతో కోర్టు కూడా షాక్‌కు గురైంది. వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి విధి నిర్వహణ సమయంలో గంటల తరబడి టాయిలెట్‌లోనే ఉంటున్నాడట.
ఒక్కోసారి అయితే 3గంటల దాకా టాయిలెట్ నుంచి బయటకు రాడట. అలా రోజు మొత్తం మీద 6 గంటలు అక్కడే ఉంటాడని కోర్టుకు కంపెనీ వివరించింది. తనకు మలద్వారం సమస్య ఉందని, ఈ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉద్యోగి కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం మాత్రం కంపెనీకే మద్దతుగా నిలిచింది. విధులు 8 గంటలు అయితే 6 గంటలు టాయిలెట్లోనే గడిపితే డ్యూటీ ఎప్పుడు చేస్తావని ప్రశ్నించింది. అతడు ఉద్యోగానికి అనర్హుడని తీర్పు వెల్లడించింది.