కోడెల కుటుంబానికి చంద్రబాబు న్యాయం చేస్తారు: ఆనంద్ బాబు

-

సామాజిక సమీకరణల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా అధినేత చంద్రబాబు నియమించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు(Nakka Anand Babu) తెలిపారు. సత్తెనపల్లిలోని కోడెల శివరామ్‌ నివాసంలో ఆయనతో టీడీపీ త్రిసభ్య బృందం సభ్యులు చర్చలు జరిపారు. కోడెల(Kodela Siva Prasad Rao) కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆనందబాబు(Nakka Anand Babu) తెలిపారు. తాజా నిర్ణయంతో కోడెల అభిమానులకూ కొంత బాధ ఉంటుందని.. త్వరలోనే చంద్రబాబు శివరామ్‌తో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాగా సత్తెనపల్లి ఇన్‌ఛార్జిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివరామ్‌(Kodela Sivaram) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read Also:
1. ఎవరైనా సరే చంద్రబాబు జోలికి వస్తే తగ్గేదేలే.. ఇచ్చి పడేస్తాం: బుద్ధా 
2. ఆ అవకాశం నాకు దొరకడం సంతోషంగా ఉంది: కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...