ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

Manish Sisodia

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 6 వరకు సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసోడియాను సిబీఐ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు చార్జిషీట్ పత్రాలు ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నాడంటూ ఈడీ ఆరోపించించిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకోబోతుందనే చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఇప్పటికే ఆరోపించింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనం అవుతోంది.

Read Also:
1. ఎవరైనా సరే చంద్రబాబు జోలికి వస్తే తగ్గేదేలే.. ఇచ్చి పడేస్తాం: బుద్ధా 
2. ఆ అవకాశం నాకు దొరకడం సంతోషంగా ఉంది: కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here