ఏ2 దేశీ ఆవు నెయ్యి విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

-

D2C Dairy brand Sid’s farm Launches A2 Desi Cow Ghee: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, నేడు తాము ఏ2 దేశీ ఆవు నెయ్యిని తమ వినియోగదారుల కోసం భారత గణతంత్య్ర దినోత్సవ వేళ విడుదల చేసినట్లు వెల్లడించింది. సిద్స్‌ ఫార్మ్‌ గత ఆగస్టులో ఏ2 దేశీ ఆవు పాలు విడుదల చేసింది. వీటికి అపూర్వమైన స్పందనను అందుకుంది. ఈ ఆదరణ అందించిన స్ఫూర్తితో ఏ2 దేశీ ఆవు నెయ్యి ను అత్యంత సరసంగా 350 గ్రాములకు గానూ 999 రూపాయలలో అందించనున్నారు.

- Advertisement -

సిద్స్‌ ఫార్మ్‌ ఇప్పుడు ఎక్కువ మంది అభిమానించే బ్రాండ్‌ గా నిలిచింది. హైదరాబాద్‌లో పలు స్టోర్లలో ఇది లభ్యంకావడంతో పాటుగా బెంగళూరులో ఈ–కామర్స్‌ మార్గంలో సైతం లభిస్తుంది. పాలు మరియు పన్నీర్‌, పెరుగు, నెయ్యి, వెన్న ఇది అందిస్తుంది. సిద్స్‌ ఫార్మ్‌ యొక్క వినూత్న ఆఫరింగ్‌ తో వినియోగదారులు ఆవు, గేదె పాలు మరియు డెయిరీ ఉత్పత్తులను తమ ప్రాధాన్యతలకనుగుణంగా ఎంచుకోవచ్చు.

ఏ2 దేశీ ఆవు నెయ్యి విడుదల సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ మరియు మేనే జింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ సిద్స్‌ ఫార్మ్‌ వేసిన ఓ ఆర్గానిక్‌ ముందడుగు ఏ2 దేశీ ఆవు నెయ్యి. దేశీ ఆవు పాలకు వచ్చిన స్పందనతో ఈ నెయ్యి విడుదల చేశాము. భారతీయ వంటగదిలో ఖచ్చితంగా కనిపించే నెయ్యి, జీర్ణశక్తి మెరుగుపరచడం, బలం, ఆరోగ్యం పెంపొందించడం కోసం వినియోగిస్తుంటారు’’ అని అన్నారు

ఆయనే మాట్లాడుతూ ‘‘నేడు వినియోగదారులు నెయ్యి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అంతేకాదు, చక్కటి నాణ్యత కలిగిన ప్రీమియం నెయ్యికి డిమాండ్‌ అధికంగా ఉంది. ఈ కారణం చేతనే ఏ2 దేశీ ఆవు నెయ్యిని వినియోగదారుల ఇంటి ముంగిట అందించే ప్రయత్నం చేస్తున్నాము’’ అని అన్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...