Diwali Cracker | దీపావళి టపాసులతో ఇంత డేంజరా..!

-

Diwali Cracker |దీపావళి అంటే దీపాల పండగ. కానీ ప్రస్తుతం ఇది కాస్తా టపాసుల పండగగా మారిపోయింది. దీపావళి వచ్చిందంటే ప్రతి వీధి కూడా టపాసుల మోతలతో దద్దరిల్లిపోతుంటాయి. అయితే ఈ టపాసుల వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం కలుగుతుందని, పలు రాష్ట్రాల్లో బాణాసంచాపై నిషేధం విధించాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఢిల్లీ వంటి కాలుష్యంతో ఎక్కువగా ఇబ్బంది పడే రాష్ట్రాల్లో అయితే టపాసులు కొనడం, అమ్మడం, కాల్చడం అన్నీ నిషేధమే. నిజం చెప్తే ఈ టపాసుల నుంచి వచ్చే పొగ మన ఆరోగ్యానికి తీవ్ర హానీ చేస్తుందని, ఇది మనకు యమ డేంజర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సంవత్సరంలో మూడు నాలుగు రోజులు కాల్చే టపాసులతో మన ఆరోగ్యానికి ఏమవుద్దిలే అని చాలా మంది అనుకుంటారని, కానీ ఆ మూడు నాలుగు రోజుల్లో మనం పీల్చే పొగ శాశ్వత డ్యామేజ్ కూడా చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ పొగ వల్ల ఆస్తమా వంటి సమస్యలు కూడా వస్తాయని, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్న మాట. టపాసుల వల్ల కలిగే వాయు కాలుష్యం వల్లే గాలిలో పెరిగే హానికరమన కణాలు మన శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయని, దాని వల్ల దగ్గు రావడం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు నిపుణులు.

- Advertisement -

వారికి మరింత జాగ్రత్త అవసరం..

దీపావళి వేళ పెరిగే గాలి కాలుష్యం వల్ల ఎన్నో రోగాలకు, హానికరమైన కణాలకు మన శరీరం నెలవు అవుతుంది. ఈ దీపావళి వేళ ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారికి అధిక రక్షణ చాలా అవసరం. కాబట్టి దీపావళి సమయంలో బాణాసంచా అతిగా కాల్చే మూడు నాలుగు రోజుల పాటు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

టపాసుల( Diwali Cracker) పొగ డేంజర్ ఇందుకే..

టపాసుల నుంచి వెలువడే పొగలో సల్ఫర్, నైట్రేయిడ్ శాతాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఊపిరితిత్తులకు తీవ్ర ప్రమాదం ఉంటుందని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఉన్న వారు ఈ పొగకు చాలా దూరంగా ఉండాలని పలమనాలజిస్ట్‌లు చెప్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నా లేకున్నా టపాసులు కాల్చే సమయంలో మాస్క్ ధరించడం మంచిదని, ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను కూడా ఇటువంటి విష వాయువుల నుంచి కాపాడుతుందని వైద్యులు చెప్తున్న మాట.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

ఆస్తమా, శ్వాసకోవ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్న వారు దీపావళి వేళ అనే కాకుండా ప్రతి రోజూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, కాలుష్యానికి ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ కాకూడదని వైద్యులు చెప్తున్నారు. దీపావళి వేళ మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. ఈ సమస్యలతో ఉన్న వారు పటాకులు పేలుతున్న ప్రదేశాలకు, లేదా అతిగా పొగ వెలువడుతున్న ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు. కుదిరితే దీపావళి రోజు ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తితే ఇన్‌హేలర్‌ను వినియోగించాలంటున్నారు వైద్యులు.

ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం.. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల మన శ్వాసకోశ మార్గాలు తేమగా ఉండి, శ్వాసతీసుకోవడం సమస్య రాకుండా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా నీరు అతిగా తాగడం వల్ల శ్వాస మార్గాల్లో శ్లేష్మ పొర ఎక్కువ మందంగా మారదని, దుమ్ము, పొగతో కలిగే ఇబ్బంది బాగా తగ్గుతుందని వివరిస్తున్నారు నిపుణులు. వీటితో పాటుగా ఇంట్లో గాలిని కూడా శుద్ధిగా ఉండేలా చూసుకోవాలని, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయిర్ ఉంచుకోవడం మంచిదని, టపాసులు కాల్చే సమయంలో బయటి పొగ లోపలికి రాకుండా ఇంటి కిటికీలు, తలుపు మూసి ఉంచడం మంచిదని వివరిస్తున్నారు నిపుణులు.

Read Also: ఉప్పునీరు తాగితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harshit Rana | న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌.. రంగంలోకి యువ పేసర్..

న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆఖరికి టెస్ట్ మ్యాచ్...

Salt Water Benefits | ఉప్పునీరు తాగితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా!

Salt Water Benefits | ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నెన్నో...