Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు వైన్స్ ముందు బారులు తీరుతున్నారు. ఎండ వేడి తట్టుకునేందుకు చల్ల చల్లని బీర్లు తాగుతున్నారు. అయితే అలాంటి మందుబాబులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూసేందుకు రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Liquor Shops | మే 11 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటు బార్లు, కల్లు కాంపౌడ్లు, పబ్‌లు కూడా మూత పడనున్నాయి. అలాగే కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం షాపులు మూతపడనున్నాయి. పోలింగ్ వేళ ఎలాంటి వివాదాలు, ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది.