మూడు రోజుల పాటు లాభాల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 62,917కి పడిపోగా.. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 18,688 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, రియాల్టీ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేకులు పడ్డాయి. నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయ.ఇక విప్రో , ఇండస్ ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలు చవిచూశాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ రూ.82.18గా ఉంది.
మూడు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
-