వినియోగదారులకు వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో అప్టేడ్స్ పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరొక ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఎవరికైనా వాట్సాప్ మెసేజ్ ని పంపితే అందులో టైపింగ్ మిస్టేక్స్ వల్ల అక్షర దోషాలు ఉంటే దాన్ని ఎడిట్(Edit) చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటికే డెవలపర్లు ఈ ఫీచర్ ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపించిన 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకునేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. వాట్సాప్ బేటా వెర్షన్ లో మాత్రమే ఈ సదుపాయం పనిచేయనుంది. మెసేజ్ ని సెలెక్ట్ చేయగానే ఇన్ఫో, కాపీ, ఎడిట్ అనే ఆప్షన్స్ కనబడతాయి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సందేశాలను సవరించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బేటా టెస్టింగ్ లో ఉంది. భవిష్యత్తులో దీనిని మరింత అప్ డేట్ చేసే అవకాశం ఉంటుందని వాట్సాప్(WhatsApp) బేటా వెబ్ సైట్ తెలిపింది.
Read Also: పుష్ప-2 గెటప్‌లో అలరించిన వైసీపీ ఎంపీ
Follow us on: Google News, Koo, Twitter