వారికి విమాన టికెట్లపై 10% డిస్కౌంట్‌

10% discount on air tickets for them‌

0
293

బడ్జెట్‌ క్యారియర్‌ ‘ఇండిగో’ సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కొన్ని విమాన టికెట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ‘వాక్సి ఫేర్‌’ ఆఫర్‌ను ఇండిగో ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. భారత్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఇండిగో వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకునేవారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అంతేగాక, బుక్‌ చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ పొందొచ్చని పేర్కొంది.