ఆకలేస్తోందయ్యా…. కన్నీరు తెప్పిస్తున్న యదార్థ సంఘటన…

ఆకలేస్తోందయ్యా.... కన్నీరు తెప్పిస్తున్న యదార్థ సంఘటన...

0
34

మిట్ట మధ్యాహ్నం నడినెత్తిమీద భానుడు గుండెల్లో భారం చూపుల్లో ఆకలి బతుకుల్లో జీవం కోల్పోయిన వేళ పిడికిడు ముద్ద కోసం ఆకలి పోరాటం దేహానికి కరోనా చావు భయం చూపుతుంటే జీవితంతో నిత్యపోరాటం తప్పనిసరిగా మారుతోంది… కరోనా కల్లోలం పరిచయం చేస్తున్న హృదయ విదాకర ఘటన అనంతపురం జిల్లా సర్వజనాసుపత్రి నిలువెత్తు సాక్ష్యం…

అక్కడ ఉన్న ప్రజలకు ఆకలి తీరే దారి లేక రోజు మధ్యాహ్న సమయానికి రోడ్డు మీదకు వచ్చి ఎదురుచూపులు చూస్తున్న వారిని గమనిస్తే గుండె తరుక్కుమనకపోదు… ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు రోజు అన్నం లభించడంలేదు… జేబులో డబ్బులు ఉన్నా హోటల్ తెరవని పరిస్థితి దీంతో ఆసుపత్రికివచ్చిన వారందరు అన్నమో రామచంద్రా అని అర్తనాధాలు చేస్తున్నారు…

కరోనా వేళ ఒకయాన బిర్యాని అంటాడు… ఇంకొక ఆయన అన్నం, పప్పు, రసం, సాంబార్, పెరుగు అంటాడు… మరొక ఆయన రుచికరమైన భోజనం అంటాడు… ఇదిగో ఈ రోజు వందమందికి ఇచ్చాము.. అంటాడు… అదిగో 200 మందికి ఇచ్చామంటాడు… పేపర్లో నేను ఇచ్చినట్లు వచ్చింది కదా చూడలేదా కరోనా వస్తే మేము సైతం అన్నారు కానీ ఇక్క అవి ఏవీ కనిపించకున్నాయి… అక్కడి పరిస్థితి చూసిన ప్రతీ ఒక్కరు అధికారులు వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నారు…