ప్రజలకు అలెర్ట్..మంకీపాక్స్ లక్షణాలు ఇవే..

0
91

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ భారత్‌కూ విస్తరించింది. మొదటి రెండు కేసులు కేరళలో నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మంకీపాక్స్ ఒక వైరల్‌ డిసీజ్‌. మంకీపాక్స్‌‌ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్‌ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

మంకీ పాక్స్ వ్యాధిగ్రస్థునికి వారం నుంచి 2 వారాల పాటు జ్వరం ఉంటుందన్నారు.

తలనొప్పి, గొంతు నొప్పి, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు.

ముఖం, చేతులు, ఛాతి భాగాల్లో చిన్న చిన్న పొక్కులు ఏర్పడుతాయని పేర్కొన్నారు.

ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి.

మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు.

అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.