ఈ ఆహారం రోజువారీ డైట్ లో ఉన్నట్లయితే అన్ని లాభాలే..

0
39

మనం తినే ఆహరం నోటికి రుచిగా ఉంటే సరిపోదు, మెదడుకు రుచించాలి. అందుకు మనం సమతుల్య ఆహరం తీసుకోవాలి. ఆహారంలో అన్ని విటమిన్లు, మాంసకృత్తులు కలిగి ఉండాలి. సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ వంటివి తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరడంతో పాటు..మెదడు కూడా బాగా పని చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

సమతల్యా ఆహరం తీసుకునే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మతిమరుపు వంటి సమస్యలు కూడా  ఉండవు. ముఖ్యంగా ఎక్కువ శాతం పిండిపదార్దాలు ఉన్న ఆహరం తీసుకోవటం వల్ల అల్జెమర్స్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. కావున పిండి పదార్దాలు అధికంగా తినేవారు పండ్లు, కూరగాయలు, సీఫుడ్స్, నట్స్, వంటివి కూడా ఆహారంలో జోడించుకోవడం మంచిది.

మనం తీసుకొనే ఆహరం ఎప్పటికి ఒకటే కాకుండా వివిధ రకాల ఆహారాలని రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాహారాలు సమృద్ధిగా లభించి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్రీలు అన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల తల్లికి మరియు బిడ్డకి ఎలాంటి హాని చేకూరకుండా..ఆరోగ్యంగా జీవిస్తారు.