వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో ఎక్కువ మంది అన్నానికి బదులుగా నీళ్ళే అధికంగా తాగుతారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజు ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది. అదేంటంటే రోజు పరిగడుపున కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు.
రోజు మన శరీరానికి, చర్మానికి అవసరమైన హైడ్రేషన్‌ని అందిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి సమస్యలను అయినా ఇట్టే తొలగిస్తుంది. వేసవిలో చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఈ తలనొప్పి సమస్య నుండి ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగండి.
వేసవిలో కలబంద రసం తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోవడంతో పాటు అన్నం కూడా అధికంగా తినాలనిపిస్తుంది. కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కలబంద రసం తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎర్ర రక్త కణాలను అభివృద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.