ఆనంద్ మ‌హీంద్రా పుల్ల ఇడ్లీ పోస్ట్ వైరల్..!

Anand Mahindra Pulla Idli Post Viral ..!

0
52

మ‌హీంద్రా చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేసిన ఈ ఇడ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని పేరు పుల్ల ఇడ్లీ. చూడడానికి అచ్చం ఐస్ క్రీమ్ లా ఉండడంతో పిల్లలు ఎగబడి తినేస్తున్నారంట. ఇలాంటి వినూత్న‌మైన ఆలోచ‌న‌లు ఎన్నో వ‌స్తాయ‌ని నిరూపిస్తోంది బెంగ‌ళూరులోని ఓ రెస్టారెంట్‌.

దీనికి సంబంధించిన ఫొటోనే ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేస్తూ..ఇండియా ఇన్నోవేష‌న్ క్యాపిట‌ల్ బెంగ‌ళూరు.. ఎవ‌రూ ఊహించ‌ని రంగాల్లోనూ త‌న క్రియేటివిటీని చూపిస్తోంది. క‌ట్టెపుల్ల‌కు ఇడ్లీ.. దానికి సాంబార్‌, చ‌ట్నీ ఇవ్వ‌డం బాగుంద‌న్న‌ట్లుగా ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌కు ఎంతో మంది స్పందించారు. స‌డెన్‌గా చూసి దీనిని ఓ ఐస్‌క్రీమ్ అనుకున్నా అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. ఇంకొకరు చేయి కడుక్కునే బాధ ఉండదంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. మీ పిల్ల‌ల‌కు కూడా ఇడ్లీ తినిపించాల‌నుకుంటే ఇంట్లో స‌ర‌దాగా ఇలాంటి వినూత్న ప్ర‌యోగాలు చేస్తూ ఉండండి.