Breaking News : ఏపిలో భారీగా పెరిగిన కరోనా కేసులు – వివరాలు ఇవే

Andhrapradesh Corona cases bulletin released

0
94

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3042. నిన్న సోమవారం 2100 కేసులు నమోదు కాగా ఇవాళ భారిగా కేసులు పెరిగాయి అనే చెప్పవచ్చు. ఇవాళ 28 మంది మరణించారు. నిన్న 35 మంది మరణించగా ఇవాళ ముగ్గురు పెరిగారు.

ఇవాళ మొత్తం 88378 నమూనాలు పరీక్షించారు. చిత్తూరు జిల్లాలో ఇవాళ అత్యధిక మరణాలు చోటు చేసుకోగా ,కేసుల సంఖ్య మాత్రం తూర్పుగోదావరిలో అధికంగా నమోదయ్యాయి.

మరణాల జాబితా చిత్తూరు లో 7 మంది, తూర్పు గోదావరిలో 4, నెల్లూరులో 4,కడప 3, అనంతపురం 2, గుంటూరు 2, పశ్చిమ గోదావరిలో 2, కృష్ణా లో 1 , ప్రకాశం 1, శ్రీకాకుళంలో 1 , మరియు విశాఖపట్నంలో 1 చొప్పున మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 33230 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 3748 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12898 గా నమోదైంది. మొత్తం 19.08 లక్షల్లో 18.61 లక్షల మంది (96శాతం) మంది రికవరీ అయ్యారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 91
చిత్తూరు 358
తూర్పుగోదావరి 665
గుంటూరు 277
వైఎస్సార్ కడప 79
కృష్ణా 252
కర్నూలు 51
నెల్లూరు 251
ప్రకాశం 310
శ్రీకాకుళం 116
విశాఖపట్నం 171
విజయనగరం 61
పశ్చిమ గోదావరి 360
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.