మన దేశంలో ఇంగువ చాలా మంది వాడుతూ ఉంటారు, అయితే ఇదంతా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, ఇక ప్రసాదాలు కూరలు పచ్చళ్లు ఇలా ఎక్కడ చూసినా ఇంగువ వాడతారు, పలు మందుల తయారీకి కూడా ఇంగువ ముఖ్యం, అయితే ఇది ఖరీదు అయిన వస్తువు, ఇక ఇంగువ ముద్ద రూపంలో పొడి రూపంలో కూడా ఉంటుంది.
భారతదేశంలో ఇప్పటివరకు ఇంగువ పంటను వేయలేదు ఇంగువ పంటకు సరైన అనుకూలమైన వాతావరణం లేకపోవడం తో భారత్ లో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇంగువ పంటలు పండించ లేదు.
ఇక అన్నీ దేశాల్లో కంటే ఎక్కువగా ఇంగువ వాడేది మనమే.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఇంగువ విత్తనాలను నాటారు. ఇక తొలివిడతగా 300 ఎకరాల్లో ఇంగువ పంటను సాగు చేసేందుకు నిర్ణయించారు. ఇది దాదాపు ఐదు సంవత్సరాలు పాటు పరిశీలన చేస్తారు, ఆ తర్వాత వేలాది ఎకరాల పంట వేయాలి అని చూస్తున్నారు, అయితే మరి మనకు ఇంత ఇంగువ ఎక్కడ నుంచి వస్తుంది అని అనుకుంటున్నారా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది ఇంగువ, ఏడాదికి 942 కోట్ల రూపాయల ఇంగువ మనకు వస్తుంది.