దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం కలుగుతుంది.
తాజాగా ఏపీలోనూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం (జనవరి 10) కొత్తగా 984 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 24, 280 శాంపిల్స్ పరీక్షించగా 984 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ బారిన పడి ఎవరూ చనిపోలేదు. తాజాగా..మరో 152 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 65
చిత్తూరు 244
ఈస్ట్ గోదావరి 117
గుంటూరు 73
వైస్సార్ కడప 26
కృష్ణ 55
కర్నూల్ 15
నెల్లూరు 81
ప్రకాశం 33
శ్రీకాకుళం 47
విశాఖపట్నం 151
విజయవాడ 75
వెస్ట్ గోదావరి 02