ప్రస్తుతం మనలో చాలామంది తలలో పేల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీటి కారణంగా తలలో ఎప్పుడూ దురద పెడుతుండడంతో చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాకుండా దురదల కారణంగా చాలా మంది వేళ్లతో తలను గోకడం వల్ల పుండ్లు పడి అవి ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది.
దాంతో ఈ సమస్యను దూరం చేయడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ అనుకున్న మేరకు ఫలితాలు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అందుకే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. పేల సమస్యతో బాధపడే వారు కొబ్బరి నూనెలో హారతి కర్పూరాన్ని వేసి వేడి చేసి ఆ నూనెను తలకు బాగా పట్టించాలి.
ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేయడం వల్ల తలలో పేల సమస్య తగ్గుతుంది. ఇంకా వెల్లుల్లి రెబ్బలకు, నిమ్మ రసాన్ని కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా చేసిన ఒక గంట తరువాత తలస్నానం చేసి పేల దువ్వెనతో తలను దువ్వడం వల్ల పేలు అన్నీ బయటకు వస్తాయి.