కిడ్నీలో రాళ్లు ఉన్నాయా?..ఈ చిట్కాతో చెక్ పెట్టండిలా..

Are there kidney stones? .. Check with this tip ..

0
47

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. ఒంట్లో నీరు తగ్గడం, అపథ్య ఆహారం, మూత్ర ఇన్​ఫెక్షన్ల వంటి కారణాలతో వచ్చే ఈ రాళ్లు శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. దీనితో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కేవలం ఈ వంటింటి చిట్కాతో ఈ సమస్యను దూరం చేయచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అదేంటో తెఇప్పుడు తెలుసుకుందాం..

మునగాకుతో తయారు చేసిన ఈ పథ్యాహారాన్ని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​ పెట్టొచ్చు అని చెబుతున్నారు. మరి దీని తయారీ విధానం, కావాల్సిన పదార్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

మునగాకులు, నెయ్యి, పెరుగుమీద ఉండే నీరు, ఉప్పు

తయారీ విధానం ఇలా..

మొదట మునగాకు శుభ్రంగా కడిగేసి దానిని ఒక ముద్దలాగా నూరుకోవాలి. స్టవ్ ​మీద ప్యాన్​ పెట్టి అందులో చెంచాడు నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో ఇప్పుడు రెండు చెంచాల మునగాకు పేస్ట్​ను వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఓ గ్లాసు నీళ్లు పోయాలి. కాసేపు మరిగించాక వడపోస్తే మునగాకు కషాయం సిద్ధం అవుతుంది. ఇది చల్లారాక ఇందులో పెరుగు మీద తేటను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఔషధం రెడీ.

అరకప్పు మునగాకు కషాయం, అరకప్పు పెరుగు మీద తేటను కలుపుకుని..ఈ ఔషధాన్ని కొద్ది రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని గోరు వెచ్చగానే తీసుకోవాలి.