ఈ లక్షణాలు చికెన్ గున్యాకు సంకేతమా? నిపుణులు ఏమంటున్నారంటే?

0
38

మనలో కొంతమందికి అప్పుడప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అప్పుడప్పుడు తలనొప్పి వేధిస్తే పర్వాలేదు. కానీ అదే పనిగా రోజు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారంటే అది చికెన్ గున్యాకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వైరస్‌ సోకిన మొదటి రోజుల్లో  కాళ్లు, చేతుల కీళ్లు నొప్పిగా ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో కీళ్లలో వాపు కూడాదారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీకు కూడా కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వీలయినంత త్వరగా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు చేబుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే ఆ వ్యక్తి నరకాన్ని అనుభవిస్తూ లోకంలో జీవించాల్సిందే.

చికున్‌గున్యా వ్యాధి ఫ్లావీ వైరస్‌ కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎడిస్‌ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సక్రమించి తీవ్రమైన బాధకు లోనుచేస్తుంది. దోమ కుట్టిన 3-7 రోజుల మధ్య ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కావున పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.