టీ తాగితే మనస్సుకు కలిగే ఫీలింగ్ అంతా ఇంతా కాదు. పని ఒత్తిడికి గురైన వారు ఎందరో టీ తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు. అందులో ఇరానీ ఛాయ్ గురించి చెప్పే పని లేదు. భారత్ లోని ప్రముఖ నగరాలోనూ, పట్టణాలలోనూ ఇరానీ ఛాయ్ కున్న క్రేజే వేరు.
ఇరానీ ఛాయ్ లో తేయాకు నీరు చక్కెర తప్ప, పాలు లేకుండానే తయారు చేస్తారు కొంచెం తాగితే ఆ మజానే వేరు. ఇరానీ ఛాయ్ లో రుచికొరకు కొన్ని మసాలాలు కలపడం, రాగి పాత్రలో తయారీ చేయడం దీని ప్రత్యేకతలు. ఇరానీ చాయ్ కేవలం హైదరాబాదులోనే ప్రసిద్ధి అని, ఇక్కడ మాత్రమే దొరుకుతుందనేది ఒక అపోహ మాత్రమే.
అసలు ఈ ఇరానీ ఛాయ్ అనే పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది. వందల సంవత్సరాల క్రితం మన దేశానికి వలస వచ్చిన ఇరానీయన్ల నుండి మన దేశానికి పరిచయమైందే ఈ ఇరానీ ఛాయ్. ఇరాన్ దేశంలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా వారు మన దేశంలోకి వచ్చాక క్రమక్రమంగా ముంబై, పుణె & హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే వారు వచ్చింది బ్రిటిష్ వారిలా దోచుకునేందుకు కాదు, వాళ్లు మన దగ్గర స్థిరపడటమే కాకుండా వారికి తెలిసిన ఇరానీ చాయ్ ని అలవాటు చేసి క్రమక్రమంగా ఇరానీ ఛాయ్ వ్యాపారం చేసేందుకు ఇరానీ ఛాయ్ దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళు కుట్ర చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది.
దీన్ని మించిన ఛాయ్ చేయాలని నాణ్యమైన తేయాకు పండించారు. కానీ అంతగా రుచి లేక అది ఇరానీ ఛాయ్ కింద దిగదుడుపే అయిపోయింది. ఈ ఇరానీ కేఫ్‌లలో మనకి చిరుతిళ్ళు ఐటమ్స్ కూడా భలే రుచికరమైనవి లభిస్తాయి. ఉదాహరణకి ఇరానీ ఛాయ్‌లోకి ఎవరౌనా ఎక్కువగా ఇష్టపడేది ఉస్మానియా బిస్కట్స్. అలాగే ఓల్డ్ సిటీలో మనకి దొరికే చాంద్ బిస్కెట్స్ కూడా చాలా పాపులర్. వీటితో పాటు సమోసా , పఫ్స్ ఇలా అనేకమైన స్నాక్ ఐటమ్స్ మనకి అత్యల్ప ధరలో లభిస్తాయి. అందుకే ఇక్కడ సామాన్య ప్రజానీకం ఒక కప్ ఛాయ్ & బిస్కెట్‌తో వారి రోజుని ప్రారంభిస్తారు.