చలికాలంలో జలుబు వేధిస్తోందా?..అయితే ఇలా చేయండి..

Are you suffering from cold in winter? .. but do it like this ..

0
115
Woman using tissue

సీజన్ మారినప్పుడల్లా దానికి సంబంధించి కొన్ని జబ్బులు వస్తుంటాయి. ఇక ప్రస్తుతం చలికాలంతో జలుబు చేయడం.. ఆపై వారం, పదిరోజుల పాటు అవస్థలు పడటం చాలా మందిలో చూస్తుంటాం. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా..చలికాలంలో ఈ బాధలు ఎక్కువగా వస్తుంటాయి.

చల్లగాలికి ఇట్టే జలుబు చేస్తుంది. ఈ నేపథ్యంలో జలుబు బాధల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..చలితీవ్రత పెరిగినప్పుడు చాలా మందిలో శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చాలా తరుచుగా దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి బాధలు వేధిస్తుంటాయి. ఈ సీజన్​లో తరచూ వేధించే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు.

ఈ చిట్కాలు పాటిస్తే సరి..

పావు స్పూన్​ మిరియాల పొడిని తేనెతో కలిపి తరచూ తీసుకోవాలి.

వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి.

వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి వడకట్టుకొని కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే.. జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

మిరియాలు, ధనియాలు రెండింటిని కలిపి కషాయంగా కాచుకుని తాగినా జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

తేనెలో అల్లం కలుపుకుని తరచూ తాగుతుంటే జలుబు బాధలు పోతాయి.